ప్రజాశక్తి - భవానీపురం
స్థానిక 42వ డివిజన్‌లోని 130వ సచివాలయం పరిధిలో 100వ రోజు అదివారం గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని భవానీపురం స్వాతి రోడ్, లలితానగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 అడుగుల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను చేతబూని పాదయాత్ర చేసి కేకు కట్ చేశారు. జగనన్న ఆదేశాలతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. ప్రజలు వాలంటరీ వ్యవస్థను మెచ్చు కుంటున్నారన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడపాటి చైతన్య రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.










