ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం అన్నాపరు. మూడనమ్మకాల దిక్కార ధినోత్సవం సందర్భంగా బెంజిసర్కిల్ వద్ద గల నాస్తిక కేంద్రం వద్ద సదస్సు మంగళవారం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రదాన వక్తగా పాల్గొన్న డాక్టర్ సమరం మాట్లాడుతూ భయం, మానసిక ఒత్తిడి, అజ్ఞానం, అవిద్య మూఢనమ్మకాలను, అంధ విశ్వాసాలను పెంపొందిస్తుందన్నారు. ఇది వ్యక్తుల అభివృద్దికి తద్వారా సమాజ అభివృద్దికి ఆటంకమని తెలిపారు. శాస్త్రీయ దృషఙ్టతో సమస్యలను అర్థం చేసుకుంటే సమాజం భవ్యంగా ఉంటుందన్నారు. వ్యక్తుల ఆలోచనలలో మార్పుతో ధైర్యం పెరుగుతుందన్నారు. అనంతరం హేతువాద సంఘం ప్రదాన కార్యదర్శి జె.వి.కృష్ణయ్య రచించిన 'హేతువాదం' పుస్తకాన్ని డాక్టర్ సమరం ఆవిష్కరించారు. రచయిత కృష్ణయ్య మాట్లాడుతూ హేతువాద ఆలోచనలతో వివేకాన్ని, విచక్షణను, ఇంగిత తజ్ఞానం పెంపొందించి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, సామాజిక రుగ్మతలతో దోపిడీకి గురికానటువంటి శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈపుస్తకం రాసినట్లు తెలిపారు. సదస్సులో విశ్వం సంస్థ ప్రతినిధి, సైన్సు ప్రచారకుడు యూనివర్స్, మెజీషియన్ ఆదినారాయణ, సైకాలజిస్టు డాక్టర్ రమాదేవి, హరి సుబ్రహ్మణ్యం, డి.లక్ష్మీ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.










