ప్రతి సమస్యకూ గ్రీవెన్స్ నెంబర్
ఎమ్మెల్యే
బియ్యపు మధుసూదన్ రెడ్డి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు అర్జీల రూపంలో ఇస్తున్న ప్రతి సమస్యకూ గ్రీవెన్స్ నంబర్ ఇస్తామని తద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలోని 9వ వార్డు (యానాది సెంటర్, పీవీ రోడ్, హరహర బావి, ఫైర్ స్టేషన్, బ్రాహ్మణ వీధి, గౌండ్ల వీధి, సీతాలమ్మ గుడి వీధి, దక్షిణ కైలాస నగర్)లో పర్యటించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లబ్ధిదారుల వద్దకు వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా?' అని అడుగుతూ ముందుకు సాగారు. స్థానిక సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జనార్దన్‌రావు పవార్, ముత్యాల పార్థసారథి, రామచంద్రారెడ్డి, రఘు నాయుడు, అల్తాఫ్, పాలమంగళం రవి, పవన్, శోభన్ నాయుడు పాల్గొన్నారు.










