- శాఖల లింకుతో ఆదాయం గ్యారంటీ ..
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఖజానాకు చేరే ఆదాయాన్ని గ్యారంటీ చేసుకోవడంతో పాటు, దానిని మరింత పెంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ వనరుల ద్వారా వచ్చే ఒక్క రూపాయిని కూడా కోల్పోకుండా ఉండటంతో పాటు అదనపు మొత్తం ఖజానాకు చేరేలా ప్రణాళికలను రూపొందించింది. దీని కోసం వివిధ శాఖల మధ్య లింకు ఏర్పాటు చేయనున్నారు. ఒక దగ్గర జమ కాకపోయినా మరోచోట వసూలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. నేడు (బుధవారం) జరగనున్న కీలక సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. జిbస్‌టి, మద్యం ఆదాయం, ఖనిజాలు, అటవీ సంపద, రిజిస్ట్రేషన్లు వంటి అనేక శాఖల్లో ఆదాయాన్ని గ్యారంటీగా పెంచుకోవడం ఎలా అన్నదానిపై చర్చించనున్నారు.
రైతుల నుండి ఇలా....
భూమి శిస్తు, నీటి తీరువా వసూళ్లను ఇక ధాన్యం సేకరణతో ముడిపెట్టనున్నారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా చెల్లించే మొత్తంలో దీనిని మినహాయించుకోనున్నారు. దీనికోసం వ్యవసాయ భూములు, నీటి తీరువా రికార్డులను అనుసంధానించనున్నారు. అంటే రైతుల చెల్లింపులతో నిమిత్తం లేకుండానే వారు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరిపోతుంది.
పక్కాగా రిజిస్ట్రేషన్లు
వివిధ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నూరుశాతం వసూళ్లు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్‌శాఖను పురపాలన, రెవిన్యూ శాఖలకు లింకు చేయనున్నారు. ధృవీకరణ పత్రాల కోసం సంబంధిత శాఖకు ప్రజలు వెళ్లగానే సదరు ఆస్తికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారా లేదా అన్నది తెలిసిపోతుంది. చెల్లించని వారు చెల్లిస్తేనే వారు అడిగిన పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు..
జిఎస్‌టి వసూళ్లు ఇలా..
నూరుశాతం జిఎస్‌టి వసూళ్ల కోసం వివిధ శాఖల డాటాబేస్‌ను లింక్ చేయనున్నారు. దీంతో ఒక చోట చెల్లించకపోయినా మరో చోట తెలిసిపోతుంది. దీనిని ఆధారంగా చేసుకుని పూర్తిస్థాయిలో జిఎస్‌టి వసూళ్లు చేయనున్నారు. మద్యం విక్రయాలకు సంబంధిరచి నిర్వహణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గిరచుకోవాలన్నదానిపైనా దృష్టి సారిరచనున్నారు. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మాసాల్లో ఈ వ్యయం పెరిగినట్లు గుర్తిరచారు. అలాగే రాష్ట్ర ఆదాయానికి గండిపడకుండా అక్రమ మద్యం రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెరట్‌ను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఖనిజాలకు సంబంధిరచి మూతపడిన గనులను తిరిగి ప్రారంభిరచేరదుకు చర్యలు తీసుకోనున్నారు.










