Feb 27,2023 21:40

ఫొటో : హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తున్న పోలీసులు

ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డు
ప్రజాశక్తి-ఉదయగిరి : జరుగుతున్న ప్రమాదాల నివారణకు వస్తున్న వేసవికాలం దృష్ట్యా జిల్లా ఎస్‌పి విజయరావు ఆదేశాల మేరకు రిజర్వాయర్‌లో యువత విద్యార్థులు ఈత కొట్టడం నిషేధిస్తూ హెచ్చరిక బోర్డులను సిఐ గిరిబాబు, ఎస్‌ఐ ఎన్‌.ప్రభాకర్‌ ఏర్పాటు చేశారు. సోమవారం మండల పరిధిలోని గండిపాళెం రిజర్వాయర్‌ ప్రాంతంలో పోలీస్‌ నిషేధిత హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ గిరిబాబు మాట్లాడుతూ ఈ రిజర్వాయర్లో లోతు ఎక్కువగా ఉన్నందున ఈతకు దిగుట ప్రమాదకరంమని అందుకు ఈతను నిషేధించినట్లు తెలిపారు.
రానున్న వేసవి కాలంలో విద్యార్థులకు సెలవుల రానున్నాయని గ్రామ చుట్టుపక్కల ఉన్న యువత ప్రాణాంతకరంగా ఉన్న రిజర్వాయర్‌లో ఈత కోసం దిగరాదన్నారు. ఎవ్వరైన రిజర్వాయర్‌ లోనికి దిగినచో పోలీస్‌ వారు తీసుకొనే చర్యలకు బాధ్యులు కాగలరని హెచ్చరించారు. అనంతరం సిబ్బంది గ్రామస్తులకు జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా హెచ్చరిక నిబంధనలను ఉల్లంఘిస్తే 9440700001, 9440700002 ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.