ఫొటో : సూచనలిస్తున్న జిల్లా వనరుల కేంద్రం డిఆర్‌సి, ఎడిఎ లక్ష్మిమాధవి
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
ప్రజాశక్తి-ఉదయగిరి : రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగబడులు లాభాలు పొందవచ్చని జిల్లా వనరుల కేంద్రం డిఆర్‌సి, ఎడిఎ లక్ష్మిమాధవి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని దుంపవారిపల్లి గ్రామంలో వరి పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలంబడి కార్యక్రమంతో రసాయనిక ఎరువుల వినియోగం సాగు పెట్టుబడి ఖర్చును తగ్గించి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని ఆమె తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్న సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి సహజ సిద్ధంగా పురుగుల ఉధృతి తగ్గుటకు పిరమైన ట్రాపుల ఉపయోగం వేప నూనె వాడకం గురించి వివరించారు. కార్యక్రమంలో ఎఇఒ రాజశేఖర్, రహమతుల్లా జెడ్‌బిఎన్‌ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.










