Apr 28,2023 22:08

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : మండలంలోని దేపూరు, నువ్వురుపాడు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోవు ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా వ్యవసాయంలో రైతులు ఏ పంటలు వేసుకోవాలి.. వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి.. అనే విషయంపై ఈ గ్రామాలలో మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్‌ ఎం.సుబ్బమ్మ, పి.ఆర్‌.పి.నాగరాజు, ఐసిఆర్‌పి సుబ్బరాయుడు, డివిజన్‌లోని ఇతర ఐసిఆర్‌పిలు గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.