మంత్రితో మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి
ప్రకృతి వ్యవసాయం చాలా సులభతరం
నెల్లూరు:పకతి వ్యవసాయం కష్టం కానేకాదు.. చాలా సులభతరం..రసాయనాలకు బదులుగా జీవ ఎరువులు, కషాయాలు (బయో - ఫెస్టిసైడ్స్) వాడితే ఖర్చు 50 శాతం తగ్గుతుంది. ఖర్చు ఎప్పటికీ పెరగదని, ఒకేసారి అదే భూమిలో 5,6 పంటలు పండించి అత్యధిక లాభాలు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ కో ఆర్డినేటర్ కర్నాటి ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ కర్నాటి ప్రభాకర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ప్రకతి వ్యవసాయ అభివద్ది చేయడం కోసం సంభందించిన అనేక ముఖ్య విషయాలను మంత్రి దష్టికి తీసుకొచ్చారు. ప్రకతి వ్యవసాయం బలాలు.. ప్రకతి వ్యవసాయం ఖర్చు తక్కువ - నికర ఆదాయం ఎక్కువ చేకూరుతందన్నారు. 30 రకాల నవధాన్యాల విత్తనాలతో భూమి సాగు చేయడం వల్ల, వానపాములు, పాజిటివ్ భ్యాక్టీరియ కల్సి ''గేమ్ చేంజర్ గా'' మారి భూమితత్వాన్ని మార్చి భూమిని సారవంతంగా మార్చుతాయన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యం - విష రసాయనాలు లేని వంద శాతం ప్రకతి వ్యవసాయం సాగు పద్దతులతో పండించిన ఆహార పదార్థాల ద్వారా మాత్రమే సాధ్యమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మాలకొండయ్య, అడిషినల్ డిపిఎం రవిచంద్ర, ఆర్‌వైఎస్‌ఎస్ కేడర్ తదితరులు పాల్గొన్నారు.










