Mar 02,2023 21:59

హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

కదిరి టౌన్‌ : ప్రజావాణిని శాసనసభలో వినిపించే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపిద్దామని సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు అడ్వకేట్లను అభ్యర్థించారు. ఈ మేరకు వారు గురువారం పట్టణంలోని అడ్వకేట్లను, ప్రయివేటు ఫైనాన్స్‌ కార్యాలయాల్లో ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును పోతుల నాగరాజుకు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బి. సుబ్బిరెడ్డి, సిఐటియు నాయకులు జిఎల్‌. నరసింహులు, జగన్మోహన్‌, రామ్మోహన్‌, ముస్తాక్‌అలీ, సుధాకర్‌, తిరుపాలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎన్నికల్లో పిడిఎఫ్‌ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలిపించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. సచివాలయాలు, తహశీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగులను కలిసి పిడిఎఫ్‌ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామకృష్ణ, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నరేష్‌, రఫీక్‌, నాగేష్‌, రమేష్‌, బాబు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో..... ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రభుత్వ, ప్రవేటు విద్యాలయాల్లో పిడిఎఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.