ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాంవిసికె పార్టీ జాతీయ అధ్యక్షులు :డాక్టర్ తిరుమావళవన్
మదనపల్లె అర్బన్ : నేడు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని, రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితి ఏర్ప డిందని విసికె పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తిరు మావళవన్ అన్నారు. శనివారం విడుదలై చిరుతైగల్ కట్చి (విసికె పార్టీ) ప్రథమ రాష్ట్ర మహాసభను పురస్కరించుకొని పట్టణంలోని బిటి కళాశాల గ్రౌండ్‌లో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ రక్షణ రణభేరి మహా సభను నిర్వహించారు. ఈ కార్యక్రామనికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుమావళవన్ మాట్లాడుతూ కార్మికుల వ్యవసాయ, దళితుల, గిరిజనుల, మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసామని, కానీ నేడు వాటన్నిటికీ మించి భారత రాజ్యాంగాన్ని రక్షిం చుకుందామని అనేటువంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశాన్ని పాలిస్తున్న వాళ్లు ఇంత ప్రమా దకరమైన వ్యక్తులు కావడం వలనే మనం రాజ్యాం గాన్ని రక్షించుకుందాం అనే నినాదన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. మనం కాపాడుకుంటున్న ప్రజాస్వామ్యం వెలుగులను ధ్వంసం చేస్తున్నారని, అంబేద్కర్ శ్రమించి రచించిన రాజ్యాంగం 70 సంవ త్సరాలుగా కాపాడుకుంటున్న ప్రజాస్వామ్య విలు వలను ఈ ఎనిమిది సంవత్సరాలలోనే వాళ్లు పూర్తిగా ధ్వంసం చేసే స్థాయికి దిగజారి పోయారని తెలి పారు. దేశాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరు మనం అర్థం చేసుకొని ఒక అవగాహనకు రావాలన్నారు. ఈ దేశాన్ని బిజెపి పరిపాలిస్తుందని అందరూ అనుకుం టున్నారు. కానీ ఈ దేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ప .అది óకారాన్ని పదిల పర్చుకోవడం కోసం కుల, మత హింసను ప్రేరేపించి, మతాన్ని, దేశాన్ని రాజకీయ లబ్ది కోసం బిజెపి వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలను గాలికొదిలేసి, నిధుల కేటాయింపులో మొండిచేయి చూపి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన బిజెపిని 2024 ఎన్నికల్లో పాతాలంలోకి తొక్కేయాల్సిన అవసరం ఉందని, ఆ వైపుగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికే రాజ్యాంగ రక్షణ రణభేరి మహాసభను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశాన్ని పాతాళానికి తొక్కి మూడు వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి మనువాద పరిపాలన మనపై రుద్దటానికి మోడీ సిద్ధపడ్డాడని అన్నారు. ఈ సమాజంలో కులాధిపత్యాన్ని బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, అగ్రకుల ఆతిపత్యాన్ని తెచ్చి అణగారిన కులాలను అణగదొక్కి శ్రామిక లోకాలను తుంగలో తొక్కేసి దానిపై అంబానీ, అదానీ జెండా ఎగరేసి కార్పొరేట్ మతోన్మాదం సృష్టించడానికి మోడీ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. అలాంటి మోడీకి ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదని తెలిపారు. ప్రజలందరికీ సమాన అవకాశాలను, సమాన గౌరవాన్ని, మానవ హక్కులను ప్రసాధించిన భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దుచేసి మళ్ళీ మనుస్మతిని భారత రాజ్యాంగంగా తీసుకొచ్చి చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని అమలు చేయాలని బిజెపి కుటిల యత్నం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిలుగా ప్రజాయుద్ధ నౌక గద్దర్, కర్ణాటక మాజీ స్పీకర్, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్ కుమార్, సిపిఐ ాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వికెసి పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్‌ఛార్జులు బాల సింగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, వికెసి పార్టీ ఎమ్మెల్యేలు బాలాజీ, మహమ్మద్ షాన్వాజ్, వికెసి పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముత్యాల మోహన్ పాల్గొన్నారు.










