Mar 04,2023 22:25

రఘువీరారెడ్డిని ఓటు అభ్యర్థిస్తున్న నాయకులు

పుట్టపర్తి అర్బన్‌ : శాసనమండలిలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల, ప్రజల సమస్యలను శాసనమండలిలో ప్రశ్నించే వారికి అవకాశం కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు, యుటిఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో బ్యాంకులు, పాఠశాలల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులను కలిసి పిడిఎఫ్‌ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి పిడిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్నారన్నారు. వారిని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. విజ్ఞతతో తమ అమూల్యమైన ఓటును పిడిఎఫ్‌ అభ్యర్థులకు వేయాలని అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఇంతియాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేష్‌, నాయకులు రామకృష్ణ, బ్యాళ్ళ అంజి, పై పల్లి గంగాధర్‌, యుటిఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.
మడకశిర : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి మద్దతు ప్రకటించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వరరావు, సిఐటియు సీనియర్‌ నాయకులు ఇంతియాజ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : ప్రజల వాణిని శాసనసభలో వినిపించే నాయకులను గెలిపిద్దామని రైతుసంఘం నాయకులు కోరారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మద్దతుగా సిఐటియు, రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పట్టణంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి మాట్లాడుతూ నిరుద్యోగ, యువతి, యువకుల, ఉద్యోగ ,ఉపాధ్యాయుల హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ , మండల కార్యదర్శి బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్ష తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీఅభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ కార్యదర్శి శ్రీరాములు, ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి కుళ్లాయప్ప, రైతు సంఘం నాయకులు హరి, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకుడు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : పిడిఎఫ్‌ బలపపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డికి మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు కొత్త చెరువులో శనివారం ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులకు, ఉపాధ్యాయులను కరపత్రాలు పంపిణీ చేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గంగాధర్‌, ముత్యాలు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు ను గెలిపించాలని చేనేత, కార్మిక సంఘం, నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకటవ సచివాలయం, కెనరా బ్యాంక్‌ నందు శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజగోపాల్‌, చేనేత కార్మిక సంఘం మండల నాయకులు చంద్రశేఖర్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి శ్రీకాంత్‌, భవన నిర్మాణ మండల నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి సిపిఎం పట్టణ కార్యదర్శి నరసింహప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలిల ఆద్వర్యంలో శనివారం పట్టణంలోని సచివాలయలల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో, కోర్టు ఆవరణంలో విసృతంగా ప్రచారం నిర్వహించారు. పిడిఎఫ్‌ బలపరుస్తున్న పశ్చిమ రాయలసీమ అభ్యర్థి పోతుల నాగరాజు, టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాల్సిందిగా అందరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.