ప్రజాసేవలో డిఎస్‌ఆర్ ట్రస్ట్ ముందంజ
ప్రజాశక్తి-అల్లూరు : ప్రజాసేవలో దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ముందంజలో ఉందని ట్రస్ట్ నిర్వాహకులు దేవిరెడ్డి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నార్త్‌మోపూరు సమీపంలోని ఇందుపూరు, పురిణి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న డిఎస్‌ఆర్ ట్రస్ట్‌లో ఘనంగా 6వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి మండల ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ విస్తృత సేవలు అందిస్తున్నారని వివరించారు. పేద ప్రజలకు సేవ చేయడమే మా ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఎంతో మందికి ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కల్పించమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అలాగే హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు విరివిగా సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ ఇందుపూరు అనిల్ కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జి రామచంద్ర రావు, అనంతరాజు బాలకృష్ణంరాజు, కోడూరు సాధక్‌కుమార్‌రెడ్డి, కొప్పు శ్రీనివాసులు, ఎరటపల్లి శేఖర్‌రెడ్డి, డాక్టర్లు అభిషై, జెట్టి రమేష్, నరేంద్ర తదితరులున్నారు.










