Nov 25,2022 21:31

సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి

గుడిబండ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని తాళికెర గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లగా ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మడకశిర మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ జయరాములు. ఎడిసిసి బ్యాంక్‌ డైరెక్టర్‌ కారుణ్య రాజశేఖర్‌, ఎంపీపీ రాధమ్మ, జెడ్పీటీసీ భూతరాజు, వైస్‌ ఎంపీపీ రత్నమ్మ శివన్న, సర్పంచి రంగస్వామి, ఎంపీడీవో రామారావు, తహశీల్దార్‌ మహబూబ్‌పీరాతో పాటు ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల : గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పెనుగొండ శాసనసభ్యులు శంకర్‌ నారాయణ తెలిపారు. పట్టణంలో మూడో వార్డులో శుక్రవారం నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ లక్ష్మీనరసప్ప, టౌన్‌ కన్వీనర్‌ ధనుంజయ రెడ్డి, జెడ్పీటీసీ జడ్పిటిసి జయరాం నాయక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ శంకర్‌ రెడ్డి, ఎంపీపీ ప్రమీల మూర్తి, సర్పంచులు సరోజ నాగే నాయక్‌, రామాంజనేయులుతో పాటు ఆయాశాఖల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బత్తలపల్లి : మండలంలోని పోట్లమర్రి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పోరేషన్‌ చైర్మన్‌ సూర్యప్రకాష్‌ బాబు, ఎంపీపీ గుర్రం వనజ, కోటి సుధ, సర్పంచు దామోదర్‌, కోటి నరేష్‌ కుమార్‌, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారుఈసందర్భంగా గ్రామంలో రూ.40లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీపీ గుర్రం వనజ, జెడ్పీటీసీ కోటి సుధ చేతులమీదుగా ప్రారంభించారు.