గోరంట్ల రూరల్ : ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం చూపడానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం గోరంట్ల మండలం పాలసముద్రం పంచాయతీ పరిధిలోని కాటేపల్లి, రాగి మేకల పల్లి, సాములపల్లి గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని అక్కడే ఉన్న అధికారులకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, ఫక్రుద్దీన్ సాహెబ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బూదిలి వేణుగోపాల్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు సామలపల్లి రాము, పాలసముద్రం సర్పంచి గంగప్ప, గోవిందరెడ్డి, గుంతపల్లి నర్సిరెడ్డి, విజయసింహారెడ్డి, సమరసింహారెడ్డితో పాటు వైసీపీ నాయకులు, మండలంలోని అన్ని శాఖల అధికారులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాండ్లపెంట : మీ ఇంటికి వచ్చాం... సమస్యలు ఉంటే చెప్పండి అని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గ్రామస్తులను కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని గాండ్లపెంట సచివాలయం పరిధిలోని నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీ ఇంటి గడపకు వచ్చాం సమస్యలు ఉంటే తమకు చెప్పండని ఆయా కాలనీప్రజలను కోరారు., ఈ సందర్భంగా పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబందిత అదికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి. అంజనప్ప వీఆర్వో అమానుల్లా, ఎపిఎం సూర్యనారాయణ, ఎంపిఒ మంజునాథ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు, ఎంపీపీ తాతం జగన్మోహన్, వైసీపీ మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు ఎస్పీ హైదర్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఫయాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.










