రాష్ట్రంలో ఇటీవల వరదలలో మరణించిన వారి కుటుంబాలకు ఒకో ప్రాణానికి రూ.5 లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారు. ఇక్కడ ప్రాథమికంగా తప్పు పరిశ్రమ యాజమాన్యందే అయినా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించడం జరిగింది. మరి వరదల వలన మరణాలు సంభవించడానికి అధికారులు ప్రజలను ముందుగా అప్రమత్తం చేయకపోవడం వల్లే అనేది బాధితులు చెబుతున్న వైనం స్పష్టం చేస్తున్నది. కుటుంబ సభ్యుల ప్రాణాలతో పాటు సర్వం కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం! ప్రభుత్వం ఇలా నష్ట పరిహారం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరి కాదు. ఇలాంటి సున్నితమైన అంశాలలో పాలకులు స్పష్టమైన, పారదర్శక విధానాలు రూపొందించి పాటించాలి.
- కంభంపాటి కోటేశ్వర రావు,
మురళీ నగర్, విశాఖపట్నం.










