Sep 25,2023 22:59

మాట్లాడుతున్న చిత్ర బృందం


ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : విజయవాడ నగరంలో సూపర్‌ స్టార్‌ కష్ణ మేనల్లుడు సుధీర్‌ బాబు సందడి చేశారు. అక్టోబర్‌ ఆరవ తేదీన విడుదల కానున్న మామా మశ్చింద్ర చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా బందర్‌ రోడ్‌లోని ఒక హౌటల్లో చిత్ర యూనిట్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ అమతం సీరియల్‌ ఫేమ్‌ హర్షవర్ధన్‌ నటుడిగానే కాకుండా దర్శకుడిగా మారి మామా మశ్చింద్ర అనే ఒక పూర్తిస్థాయి లవ్‌ కం ఎంటర్టైన్మెంట్‌ చిత్రాన్ని రూపొందించారని చెప్పారు. తాను ఈ చిత్రంలో మూడు విభిన్న క్యారెక్టర్లలో కనిపిస్తానని, దుర్గా క్యారెక్టర్‌ ఈ చిత్రానికి హైలెట్గా ఉంటుందని తెలియజేశారు. హర్షవర్ధన్‌ చెప్పిన కథ నచ్చిన వెంటనే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని, త్వరలో ట్రైలర్ను రిలీజ్‌ చేస్తామని వివరించారు. సినిమాకు సంబంధించిన పాటలన్నీ విజయవాడలోనే రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు హర్షవర్ధన్‌ మాట్లాడుతూ అమతం సీరియల్తో తాను ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యానని, అలాగే నటుడుగా కూడా ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించాలని చెప్పారు. తాను మొదట సింగర్‌ అవ్వాలని ఇండిస్టీకి వచ్చానని ఆ తర్వాత నటుడుగా రచయితగా మారానని తెలియజేశారు. దర్శకుడిగా మారిన తరువాత మొదటిగా మామా మశ్చింద్ర చిత్రాన్ని తీశానని ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తీశామని కుటుంబమంతా కలిపి సరదాగా వచ్చి చిత్రాన్ని చూసి హాయిగా నవ్వుకోవచ్చని ఆయన వివరించారు. అక్టోబర్‌ 6న సినిమా విడుదల చేస్తున్నామని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి తనను ప్రోత్సహించాలని కోరారు. తదనంతరం చిత్ర నిర్మాత సష్టి మాట్లాడుతూ తాను ఎంబీఏ పూర్తి చేసిన తరువాత మొట్టమొదటిగా నిర్మాతగా మారి మామా మశ్చింద్ర అనే చిత్రాన్ని తీశానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా ఇండిస్టీ గురించి పూర్తిగా తెలుసుకున్నానని, మంచి చిత్రాలు తీసి ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. తనకు హీరోయిన్గా అవకాశం వస్తే కచ్చితంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.