Oct 22,2023 22:07

ప్రధాని ఫోటో పెట్టకపోతే ఏపీకి నిధులు ఆపేస్తాం... కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వెల్లడి


ప్రధాని ఫోటో పెట్టకపోతే ఏపీకి నిధులు ఆపేస్తాం...

కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వెల్లడి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: వివిధ సంక్షేమ పథకాలకు, అభివద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం దారుణమని, ఇలాగైతే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఆపేస్తామని కేంద్ర రూరల్‌ డెవలప్మెంట్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని గాంధీభవన్లో కస్తూరిబా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ పిసి రాయలు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు పేరు గొప్పగా ప్రచారం చేసుకుంటా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివద్ధి పథకంలో కేంద్రం ఇచ్చిన నిధులేనని అన్నారు. ఇకపై అలాగే వివరిస్తే రాష్ట్రానికి నిధులు నిలిపివేయాల్సిన వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టులో బిజెపి పాత్ర లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ పాత్రతో జరిగిందన్నారు. నరేగావ్‌ పథకంలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు భాను ప్రకాష్‌ రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, కస్తూరిబా ట్రస్ట్‌ చైర్మన్‌ పిసి రాయలు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కస్తూరిబా ట్రస్టు ఛైర్మన్‌ పిసి.రాయలు, బండి మధుసూదన్‌ రెడ్డి, రుద్రరాజు శ్రీదేవి, ఉదయగిరి కష్ణమూర్తి, బిజెపి నాయకులు ఉన్నారు.