Apr 19,2023 20:53

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు


మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
ప్రధాని మోడీని గద్దె దింపాలి
ముత్తుకూరు: మండలంలోని తాళ్లపూడి పంచాయతీలో గమళ్లపాలెం హరిజనవాడ అరుంధతీయవాడలో సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం అంకయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గం కార్యదర్శి కొమారి నందయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు నక్కా రాధయ్య, తాళ్లపూడి సిపిఎం మండల కమిటీ సభ్యులు షేక్‌ మస్తాన్‌షా, సిపిఐ మండల కార్యదర్శి తుంగ ఏడుకొండలు, సిపిఎం మండల కమిటీ సభ్యులు జయరామయ్య, కాకి శేషయ్య, యానాదయ్య, వెంకట రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.