ఫొటో : ఆక్రమణ భూమిని పరిశీలిస్తున్న అధికారులు
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రభుత్వం భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు చేపడతామని తహశీల్లారు లకీëనరసింహం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మండలంలోని బోయిల చిరువెళ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఓ మతానికి చెందిన వ్యక్తి దర్గా అరుగు నిర్మాణం చేపట్టాలని జెండా నాటాడని తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు విఆర్‌ఒ అధికారులకు తెలపడంతో విషయం తెలుసుకున్న సిఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ శివ శంకర్‌రావుతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి తొలగించామన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేశారు.










