Apr 25,2023 21:50

ఫొటో : ఎస్‌ఐకు ఫిర్యాదు చేస్తున్న దళిత నాయకులు

పోలంరెడ్డిపై చర్యలు తీసుకోవాలి
- దళిత సంఘాల నేతల డిమాండ్‌
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : దళిత నాయకుడు వీరి చలపతిరావును అవమానించిన టిడిపి కోవూరు ఇన్‌ఛార్జి పొలంరెడ్డి దినేష్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందుకూరుపేట దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, ఎస్‌ఐ వెంకట రాజేష్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దళిత నాయకుడు మధు మాట్లాడుతూ ఒక దళిత నాయకుడిని కుక్కతో పోల్చి, దళిత జాతి మొత్తాన్ని అవమానించిన పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి వెంటనే దళితులందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో మధు, సుకుమార్‌, వెంకటకృష్ణ వంశీ, దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.