Apr 19,2023 19:17

మొక్కలు నాటుతున్న ఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి

ప్రజాశక్తి -కందుకూరు : గ్రామాల్లో జరిగే నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మహిళా పోలీసులు వెంటనే పోలీస్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌పి తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్‌పిగా బాధ్యతలు తీసుకున్న తిరుమలేశ్వర్‌ రెడ్డి జనరల్‌ విజిట్‌లో భాగంగా కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. మహిళా పోలీసులతో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సంబంధిత పోలీస్టేషన్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తొలుత కందుకూరు డిఎస్‌పి కార్యాలయాన్ని సందర్శించిన ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. కందుకూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన,్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లు పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. కందుకూరు పట్టణంలో ట్రైనీ డిఎస్పీగా తాను పని చేశాను అనే విషయాన్ని గుర్తు చేశారు. కందుకూరు డిఎస్‌పి కండే శ్రీనివాసరావు, సిఐ వెంకట్రావు, పట్టణ ఎస్‌ఐ హనీఫ్‌, రూరల్‌ ఎస్సై శివ నాంచారయ్య పాల్గొన్నారు.