Feb 27,2023 22:01

సమావేశంలో మాట్లాడుతున్న 'కందికుంట'

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : కదిరి నియోజకవర్గ కేంద్రంలో కొన్ని కారణాలవల్ల ఉద్రిక్తత పరిస్థితులు రావడానికి కారణం పోలీస్‌ అధికారి మితిమీరిన తనమేనని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడారు. 21 కేసుల్లో ముద్దాయిగా కొనసాగుతున్న ఆ నాయకుడికి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. పోలీస్‌ అధికారి మితిమీరిన అధికార మదంతో వ్యవహరించడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రజలకు సమస్యలు వస్తే ఎందాకైనా వెళతామన్నారు. పోలీస్‌ ఉన్నత స్థాయి అధికారి ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడిన మాటలపై తమకు నమ్మకం కలిగిందన్నారు. మహిళలను కించపరచడం, లాఠీఛార్జి చేయడం బాధ్యతారహితంగా పవర్తించడం లాంటి వాటికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని చెప్పడం పట్ల పోలీసు వ్యవస్థపై నమ్మకం,గౌరవం మరింత పెరిగిందన్నారు.
పరామర్శించిన అత్తార్‌ : కదిరి పట్టణంలో జరిగిన సంఘటన చూసి సిఎం జగన్మోహన్‌రెడ్డి సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ అత్తార్‌ చాంద్‌ బాషా విమర్శించారు. ఇటీవల పట్టణంలో జరిగిన సంఘటనలో గాయపడిన టిడిపి నాయకురాలు పర్వీన్‌ భానును పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.