పొగాకు వేలం కేంద్రంలో పరిశీలన
ప్రజాశక్తి మర్రిపాడు : మండలంలోని డి.సి.పల్లి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం దక్షిణ తేలిక నేలల ప్రాంతీయ అధికారి ఎం.లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పొగాకు పంటకు మంచి ధరలు ఇచ్చి ఆదుకోవాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. పొగాకు బేళ్లలో నెమ్ము లేకుండా ఇతరేతర అన్యపదార్థాలు ప్లాస్టిక్ వంటివి లేకుండా చూసుకోవాలన్నారు. గ్రేడింగ్ కండిషన్ విషయంలో తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రైతులు పొగాకు ముక్క మరియు బేళ్ల వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద నమోదు చేయించుకోవాలని, పొగాకు ముక్క, బిట్స్ ఒక బ్యారన్‌కు 500 కిలోలు మాత్రమే అనుమతించినట్లు, రెగ్యులర్ అమ్మకపు కోటాలో కలవదని ఇదిపూర్తి అదనపు కోటాగా పరిగణించబడిందన్నారు. మొదటి కోటా అమ్మిన వాళ్లు వారివద్ద ఉన్న పొగాకు ముక్కను 21శుక్రవారం రెండవ కోటాలో పెట్టుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఇన్‌ఛార్జి వేలం నిర్వహణ అధికారి ఎం.కిరణ్, కలిగిరి పొగాకు బోర్డు వేలం నిర్వహణ అధికా వి.మహేష్, ఫీల్డ్ ఆఫీసర్ ఆదర్శ్, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.










