Feb 24,2023 22:02

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌   పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కెపిటి వీధిలో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకింగ్‌ రంగంలో చాలా మార్పులు, సంస్కరణలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం కస్టమర్‌ సర్వీసులు ఇంటివద్దకే వస్తున్నాయ న్నారు. పురాతన కాలం నాటి ఇలాంటి బ్యాంక్లను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక భద్రత ఉంటుందన్నారు. పాతకాలం నాటి బ్యాంకుల్లో వినియోగదారులకు విలువ కూడా ఉంటుందన్నారు. జాతీయ స్థాయి బ్యాంకుల్లో హెల్త్‌ బీమా చేసుకోవడం వల్ల సమయానికి ఆర్థికసాయం వస్తుందన్నారు. బ్యాంకు హైదరాబాద్‌ జోనల్‌ హెడ్‌ మహమ్మద్‌ మక్బూల్‌అలీ మాట్లాడుతూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 10,500పైగా బ్రాంచులు, 13,500 పైగా ఎటిఎంలు, రూ.20లక్షల కోట్లతో వ్యాపారంతో దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సర్కిల్‌ హెడ్‌ కృష్ణమూర్తి, బ్యాంక్‌ జోనల్‌ హెడ్‌ మధుసూదన్‌, ఆర్డీఓ తిప్పేనాయక్‌, తహశీల్దార్‌ యుగేశ్వరీదేవి, తదితరులు పాల్గొన్నారు.