ప్రజాశక్తి - కంచికచర్ల : కంచికచర్ల మండలం పరిటాల పరిధిలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇంజనీర్స్‌డేను ఘనంగా నిర్వహించారు. కళాశాల పాలకవర్గ కార్యదర్శి కె.రామ్మోహన్‌రావు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. కళాశాల సిఇసి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు ఇంజినీరింగ్ బ్రాంచ్‌లకు సంబంధించిన విద్యార్థులు సజనాత్మకతను మేళవించి పలు ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. అంతే కాకుండా ఈ సందర్భంగా సిఇసి డిపార్ట్‌మెంట్ విద్యార్థులకు ఐఇటి ఈ స్టూడెంట్ ఫోరమ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు ఈ ఫోరమ్ ద్వారా నూతన సాంకేతిక అంశాలపై అవగాహనతో పాటు, వర్కుషాప్స్‌లో పాల్గొన వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ1.ఐఇటిఇ సెంటర్ చైర్మన్ డాక్టర్ బి.రాజశేఖర్ మాట్లాడారు. వన్‌టౌన్: కొత్తపేటలో గల పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శుక్రవారం ఇంజినీర్స్ డేను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆంధ్రా టెక్ లీగ్ సి.ఈ.ఓ. విశాఖపట్నం నల్లమిల్లి వెంకటరెడ్డి అధ్యక్షతన భావి భవిష్యత్ తరాలకు టెక్నాలజీని అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో వారి బంద సభ్యులు ఐ. వేణుకుమార్, కె, మల్లేష్, కె యామిని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో జోనల్ స్థాయిలో వివిధ జిల్లాలలోని పాఠశాలల విద్యార్థులకు కోడ్-ఓ-త్సవ్, 3 డి నిర్మాణ్, చిట్టీ-ప్రో వంటి అంశాలపై అవగాహన కల్పించి ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసి వారికి పోటీలు నిర్వహించారు. నందిగామ : 4వ వార్డు కౌన్సిలర్ మారం అమరయ్య, అన్నవరపు వెంకటేశ్వరరావు 2వ సచివాల యం ఇంజినీరింగ్ విభాగం సిబ్బందిని సన్మానించారు.
జగ్గయ్యపేట : ఇంజనీర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఐటి వింగ్ చైర్మన్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎంతో మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్న చక్కా సూర్య ప్రకాష్ గుప్తా(నాని) ని వారి స్వగహంలో కష్ణా జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సమైక్య సేవా కమిటీ చైర్మన్ కాకరపర్తి సోమేశ్వరరావు, వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ కొత్త కష్ణా రావు, పేరూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మైలవరం : లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో శుక్రవారం ఇంజనీర్స్ డే వేడుకలను మైలవరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మోక్షగుండం విశ్వేశ్వర య్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లయన్ ఇంజనీర్ ఆర్.వి. ఎస్.లక్ష్మణరావు, వేగి జనార్ధన రావు లను ఘనంగా సన్మానించారు. అనంతరం లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వర మాట్లాడారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం సెక్రటరీ చలువాది గుప్తా హరీష్ కుమార్, ట్రెజరర్ తిమ్మన దినేష్ బాబు, గ్యాట్ ఏరియా లీడర్ సిహెచ్.బాలగోపాల్ రెడ్డి, మెంబర్షిప్ చైర్ పర్సన్ టి. వెంకటేశ్వరరావు (మాస్టారు), లయన్స్ మెంబర్లు కోట పుల్లారెడ్డి, పాల్గొన్నారు.తిరువూరు : తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతిని అధ్యాపకులు, విద్యా ర్థులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా కళాశాల ప్రాంగణంలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళ ర్పించారు. కళాశాల చైర్మన్ పసుమర్తి వెంక టేశ్వరావు సివిల్, సమాజంలో ఇంజనీర్ల పాత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు, ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులందజేశారు. ఇబ్రహీంపట్నం : ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు ఈరోజు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163 వ జయంతి సందర్భంగా ఇన్వెస్ట్ డే జరిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణయ్య విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు వివిధ విభాగతిపతులు కళాశాల ప్రాంగణంలో గల మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు.










