Sep 20,2023 22:28

యాత్రలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - తిరువూరు : భూ సమస్యలు, డప్పు, చర్మ కళాకారుల సమస్యలపైన, దళితులకు స్మశాన వాటిక స్థలాలు కేటాయించాలని ఈ నెల 29న విజయవాడలో నిర్వహించనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి.నాగరాజు పిలుపు నిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ అధ్వర్యంలో ఈ నెల 17 నుండి 26వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామా ల్లోని దళిత పేటల్లో సమస్యలు గుర్తించేందకు బైక్‌ యాత్ర నిర్వహిస్తున్నామని నాగరాజు తెలిపారు. బుధవారం బైక్‌ యాత్ర తిరువూరు మధిర రోడ్డులో పర్యటించింది. దళితపేటలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.ఆనందరావు. కెవిపిఎస్‌ నాయకులు కుటుంబరావు, ఆకుల రవి పాల్గొన్నారు.