ప్రచారం చేస్తున్న దృశ్యం
పిడిఎఫ్ ఎంఎల్‌సిల గెలుపు కోసం ప్రచారం
నెల్లూరు:పిడిఎప్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు పోటీ చేస్తున్న పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలింపించాలని కోరుతూ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రజాసంఘాలు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రతి ఒక్క ఓటరు పిడిఎఫ్‌ఎంఎల్‌సి అభ్యర్దులకు ఓట్లు వేయాలని అభ్యర్దిస్తున్నారు. రూరల్ 30 వ డివిజన్ కొత్తూరు అరుంధతి వాడ ప్రాంతంలో పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర రెడ్డికి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి పోటీ చేస్తున్న పోక్కిరెడ్డి బాబురెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు కండె కోటేశ్వరరావు, మాజీ సర్పంచి కండె శ్రీనివాసులు శాఖ కార్యదర్శి ఖయ్యూం, పొత్తూరు రమణయ్య, నరికే దశయ్య తదితరులు పాల్గొన్నారు.మద్రాసు బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్‌లో లోడింగ్ , అన్‌లోడింగ్ విభాగాల ముఠా యూనియన్ సర్వ సభ్య సమావేశం సిఐటియు నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ ,కార్మిక ఉద్యమ నాయకులు తూర్పు రాయలసీమ,పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్ధుల గెలుపుకు సహకరించాలని నాయకులు కోరారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాలలో ఉన్నటువంటి స్నేహితులకు, బంధువులకు, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్న వారికి చెప్పి ఓట్లు వేయించాలని కోరారు. మూలాపేట సిపిఎం శాఖ పరిధిలో చమ్మండి వారి తోట ఏరియాలో ప్రజా సంఘాల నాయకులు ఇంటింటికి తిరిగి పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపినీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజి రెడ్డి , ఎం నాగేశ్వరావు, నజీర్ , మస్తానయ్య ,శరవణ , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అరవింద్ నగర్ ప్రాంతంలో ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్దులను గెలిపించాలని కోరుతూ ఆటో స్టాండ్ సిఐటియు శాఖ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో రూరల్ ఆటో కార్మిక సంఘం కార్యదర్శి సుధాకర్ రూరల్ ఆటో శాఖ కార్యదర్శి టి, వెంకీ ఆర్‌టిసి స్టాండ్ సభ్యులు అంకయ్యా, జనార్థన్, బాషా పాల్గొన్నారు. 29వ డివిజన్ పరిధిలో ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పిడిఎఫ్‌ఎంఎల్‌సి అభ్యర్దుల గెలుపును ఆకాంక్షిస్తూ ప్రచార కార్యక్రమం చేపట్టారు.










