Feb 24,2023 22:04

ఫొటో : మాట్లాడుతున్న ఎస్‌కె రెహనా బేగం

పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-కావలి : రాజకీయాలకు అతీతంగా పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలను గెలిపించుకోవాల్సిన అవసరం నిరుద్యోగులందరిపై ఉందని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎస్‌కె రెహనా బేగం అన్నారు. సిఐటియు కావలి పట్టణ కమిటీ సమావేశం శుక్రవారం పట్టణ అధ్యక్షులు ఎ.వి.క్రిష్టయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో మార్చి 13వ తేదీన జరిగే ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎంఎల్‌సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వనరెడ్డికి ప్రధమ ఓటువేసి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులు సమస్యలపై మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు కాని వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని కోరారు. కార్మికులకు వేతనాలు సక్రమంగా ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథకంలో మెనూ బిల్లులు రూ. 20 పెంచాలన్నారు. స్కూల్‌ స్వీపర్లకు రావాల్సిన మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ గౌరవధ్యక్షులు పి.పెంచలయ్య, సిఐటియు కావలి పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, పట్టణ కమిటీ సభ్యులు పి.పెంచలనరసింహం, తురక సీనయ్య, బిడదల మహేష్‌, అంగన్‌వాడీ, ఆశాలు, స్కూల్స్‌ స్వీపర్లు, మున్సిపల్‌ తదితర రంగాల నుండి పాల్గొన్నారు.