ప్రచార కరపత్రాన్ని అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి -పెనుకొండ : పిడిఎఫ్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పొతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిని గెలిపించాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ విద్యార్థి సమస్యలు, అనేక సామాజిక రాజకీయ హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొన్న పొతుల నాగరాజుకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్బంగా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సిఐటియు మండల నాయకులు తిప్పన్న, వజ్రం నాగప్ప, రెడ్డప్పరెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.










