Feb 28,2023 22:35

ప్రచారంలో పాల్గొన్న నాయకులు

పుట్టపర్తి రూరల్‌ : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా సిపిఎం, సిఐటియు నాయకులు మంగళవారం పరామర్శించారు. పుట్టపర్తి పట్టణ కేంద్రంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు ఇంతియాజ్‌ ఎస్‌ వెంకటేష్‌, రామకృష్ణ, సాంబయ్య, పైపల్లి గంగాద్రి, నరసింహులు తదితరులు పట్టణంలోని పలు కార్యాలయాలు, పట్టభద్రులను కలిసి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుని అదేవిధంగా టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద జిల్లా కార్యాలయాలు, మామిళ్లకుంట క్రాస్‌ వద్ద కళాశాల, జగరాజు పల్లి మంగళకర విద్యాసంస్థలలో ప్రచారం నిర్వహించారు.
పెనుకొండ : పిడిఎఫ్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పొతుల నాగరాజు ,కత్తి నరసింహారెడ్డిని గెలిపించాలని యు టి ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యుటిఎఫ్‌ నాయకులు సుధాకర్‌, నారాయణ స్వామి ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ప్రచారం : పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహ రెడ్డి కి మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారం ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, తిప్పన్న, వజ్రం నాగప్ప, మహబూబ్‌ బాషా, మూర్తి, రెడ్డప్పరెడ్డి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.