Feb 28,2023 21:56

ఫొటో : ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు మంగళవారం పట్టణ వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకు వెంకటయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరూ పిడిఎఫ్‌ ఎంఎల్‌సి పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను మొదటి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు.
కార్యక్రమంలో కృష్ణ, కళ్యాణి, తదితర ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.