Feb 27,2023 21:37

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం ముసునూరులో కమ్మపాలెం, మహాలక్ష్మి గుడి, ప్రాంతంలో పిడిఎఫ్‌ అబ్యర్థులను గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కార్మికులు ప్రజలు, ఉద్యోగులు, రైతుల తరుపున మాట్లాడేందుకు పిడిఎఫ్‌ తరుఫున పోటీ చేస్తున్న పట్టభద్రుల ఎంఎల్‌సి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ ప్రచారంలో ప్రజాసంఘాల నాయకులు పసుపులేటి పెంచలయ్య, జి.మధుసూదన్‌ రావు, ఒజిలీ రమేష్‌, ఒంగోలు రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.