Feb 26,2023 21:27

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-నెల్లూరు : తూర్పు రాయసీమ ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని 31వ డివిజన్‌లోని అరుంధతీయవాడలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపినీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిడిఎఫ్‌ అభ్యర్థులుగా ఉన్న గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి అభ్యర్థిగా వెంకటేశ్వర రెడ్డి, టీచర్స్‌ ఎంఎల్‌సి అభ్యర్థిగా పోక్కిరెడ్డి బాబు రెడ్డిలను మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలన్నారు.
కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నాగేశ్వరరావు, సుధా, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్‌లోని 25వ డివిజన్‌ బుజబుజ నెల్లూరులో పిడిఎఫ్‌ గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, టీచర్స్‌ ఎంఎల్‌సి అభ్యర్థి పోక్కిరెడ్డి బాబురెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కొండా ప్రసాద్‌, యు శ్రీనివాసులు, ఎస్‌.కె.నాగూరు, ఎస్‌కె బాషా, తదితరులు పాల్గొన్నారు.