Feb 24,2023 22:02

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి ఇందుకూరుపేట : పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థులు పోక్కిరెడ్డి బాబు, మీగడ వెంకటేశ్వరరెడ్డిలను తమ ఓటుతో గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు మండలంలోని పలు శాఖల ఉద్యోగులను కోరుతూ శుక్రవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని తహశీల్దార్‌ సుబ్బయ్యతో పాటు ఎంపిడిఒ కల్పన, పలు ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగులను కలిసి ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని వారిని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అధ్యక్షులు టివివి ప్రసాద్‌, మైపాటి కోటేశ్వరరావు, శ్యామ్‌ రెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు.