Apr 07,2023 18:58

మాట్లాడుతున్న పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య

ప్రజాశక్తి - రాయచోటి : 12వ పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలని పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు మిట్ట కష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పిఆర్‌టియు కార్యవర్గ సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఆర్‌టియు సంఘ నిర్మాణంలో భాగంగా మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులదే క్రియాశీలక పాత్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్‌సి కమిటీ వేసి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్ల మన్ననలు పొందాలన్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా 2024 లో జరిగే ఎన్నికలలోపు పిఆర్‌సిని అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ప్రస్తుతం ఇవ్వాల్సిన డిఎలను వెంటనే ప్రకటించాలన్నారు. బదిలీలపై ఉన్న కోర్టు కేసులను వెంటనే పరిష్కరించి బదిలీలను చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గారి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆదివారం కడపలో నిర్వహించబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అందరూ విరివిగా పాల్గొని దిగ్విజయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఫణీంద్ర, రోశయ్య, యువరాజనాయుడు, వేణుగోపాల్‌, నరసింహారెడ్డి, రామాంజనేయులు ,ఉమామహేశ్వరరావు, విశ్వనాథ్‌ లక్ష్మీ రమణయ్య, నారాయణరెడ్డి పాల్గొన్నారు.