ప్రజాశక్తి ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణంలోని నాగార్జున జూనియర్ కళాశాలలో పెట్ల పార్వతి 16వ వర్ధంతి సందర్భంగా నాగార్జున జూనియర్ కాలేజ్‌లో సభా సెమినార్లు నిర్వహించారు. ఈ సభకు కొండపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ వెనిగళ్ళ అమ్మాజీ అధ్యక్షత వహించారు. దేవినేని జోనికుమారి మాట్లాడుతూ విద్యార్థులకు సేవా సంస్థలకు సేవలందిస్తూ ప్రోత్సహించటం పెట్ల పార్వతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వెనిగళ్ళ అమ్మాజీ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థల నిర్మాణంలోనూ శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడంలోనూ సెమినార్లు ఏర్పాటు చేయడంలోనూ పెట్ల పార్వతీ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు పెట్ల పార్వతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడు తున్నాయన్నారు. ఎంఇఒ చెరుకూరి పుష్పలత మాట్లాడుతూ పెట్ల పార్వతి మెమోరియల్ ట్రస్ట్ వారు విద్యార్థులకు చేస్తున్న సేవలు వలన విద్యార్థులు అభివద్ధికి తోడ్పడుతుందన్నారు శాతవాహన రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి మాట్లాడుతూ చంద్రయాన్ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు అనే అంశంపై మాట్లాడారు. మన శాస్త్రవేత్తల పరిశోధన కషి వల్ల చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైందన్నారు. పాఠశాల కళాశాల స్థాయి మీద తరగతుల్లో (2022-23సం) ప్రథమ ద్వితీయ స్థానం పొందిన విద్యార్థిని విద్యార్థులకు, సేవా సంస్థలకు ఆర్థిక సాయం పుస్తకాలు అతిధులు అందజేశారు. అతిథులకు మెమొంటోలు అందజేయడం జరిగింది. పెట్ల పార్వతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను పెట్ల కామేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో జెవివి కొండపల్లి శాఖ అధ్యక్షులు ఎస్ నాగరాజు జెవివి కొండపల్లి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ కే సర్దార్ సాహెబ్ శ్రీనివాస్ నాగార్జున జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇన్చార్జి పి రవి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.










