రాస్తారోకో చేస్తున్న వికలాంగులు
పెన్షన్లు రద్దు చేయొద్దని రాస్తారోకో
ప్రజాశక్తి-కావలి:వికలాంగులు (మూగ, చెవుడు, కుష్టు, అంధులు, శారీరక, మానసిక వికలాంగుల అర్ధం,పర్ధం లేని కుంటిసాకులతో పెన్షన్లు తీసివేయొద్దని కోరుతూ అఖిల భారత వికలాంగుల హక్కులవేదిక జాతీయ కార్యదర్శి మండవ వెంకటరావు ఆధ్వర్యంలో సోమవారం పట్టణ ట్రంకురోడ్ వద్ద వికలాంగులు ''రాస్తారోకో ''చేపట్టారు. ఈ సందర్భంగా మండవ వెంకటరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వికలాంగులను గుర్తించి ,వారికి దాదాపు రూ.3వేలు.పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత జగనర్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ పథకాన్ని అపహాస్యం చేసి, నిబంధనలు విధించి, వికలాంగుల పెన్షన్‌తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త నిబంధనలు పేరుతో పెన్షన్లు తొలగించొద్దని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు మహబూబ్‌బాషా, బి.వేణు, గుడిగంట సురేష్, యు.రవి, తదితర వికలాంగులు పాల్గొన్నారు.










