Jul 08,2021 14:04

ఇంటర్నెట్‌ డెస్క్‌ : నేటి కాలంలో పానీపురి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఏ సీజన్‌ అయినా సరే.. కాలంతో సంబంధం లేకుండా.. ఎంతో ఇష్టంగా తింటారు. మరి అంత ఇష్టంగా తినే పానీపూరిపై అభిమానానాన్ని చాటుకోవాలంటే ఎలా..? అందుకే ఓ వధువు తనకెంతో ఇష్టమైన పానీపూరీని తన వివాహ అలంకరణలో భాగం చేసుకుంది. అదెలాగంటారా?.. యువతి పెళ్లికూతురిగా ముస్తాబై.. పూల దండలకు బదులు.. పానీపూరీ దండల్ని వేసుకుంది. అలాగే మహారాణిని తలపించేలా.. పానీపురీలతో చేసిన కిరీటంతో అలకంరించుకుంది. ఇలా పానీపూరీ కిరీటం పెట్టడంతో.. ఆ సమయంలో ఆమె నవ్వుతూ ఉన్న హ్యాపీ ఫీలింగ్స్‌ కెమెరాకి చిక్కాయి. ఇంతకీ ఈ నవవధువు పేరు అక్షయ. పానీపూరీల దండలు.. కిరీటం పెట్టుకున్న ఫొటోలని ఆమెకు మేకప్‌ వేసిన ఆర్టిస్ట్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వధువు ధరించిన పానీ పూరీ దండల ఫొటోలు మాత్రమే కాదు.. ఆమె తలపై పది పదిహేను అప్పడాలు పెట్టి వాటిని కొట్టడంతో.. అవి కాస్తా.. పూలుగా మారి తన తలపై నుంచి జాలువరుతున్నట్లుగా ఉన్నాయి. ఈ వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలను.. ఫొటోలను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్‌ పర్‌ఫెక్ట్‌ పానీపూరీ లవర్‌ అని వ్యాఖ్యానించగా.. మరొకరేమో తన కలల వివాహం నిజమైంది అని కామెంట్‌ చేశారు.

panipuri 2