రాయచోటి : జిల్లాలోని ప్రయివేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలో పేద విద్యార్థులు ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈనెల 10లోగా ఒకటో తరగతిలో దరఖాస్తు చేసుకోవాలని జెసి తమీమ్ అన్సారీయా పేర్కొన్నారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య హక్కు చట్టం కింద ప్రయివేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పేద విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశమని చెప్పారు. 25 శాతం రిజర్వేషన్లలో అనాథలు, హెచ్‌ఐవి, వికలాంగత్వం వారికి 5శాతం, ఎస్‌సిలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఓసి, బిసి, మైనారిటీ తదితర బలహీన వర్గాలకు 6 శాతం మేర మేరకు రిజర్వేషన్ సదుపాయం కల్పించారని చెప్పారు. విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రయివేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలో కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ఐబి, ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ, స్టేట్ సిలబస్‌లను అమలు చేస్తున్న అన్ని పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలని చెప్పారు. ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందడానికి 2295 మంది పేద విద్యార్థులకు అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు 115 మంది పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇంకను 2180 మంది పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకొని అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేయడానికి సహాయ కేంద్రాలు తల్లిదండ్రులు ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి సహాయ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు అని జెసి తెలిపారు. ఈ సహాయ కేంద్రాలు సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలు, ఎంఇఒ, మండల రిసోర్స్ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలో డిఇఒకార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేయడానికి సహాయం పొందవచ్చునని చెప్పారు. అర్హులైన విద్యార్థులు షషష.షరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ/=ుజు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమీపంలో ఉన్న గ్రామ సచివాలయంలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో డిఇఒ పురుషోత్తం పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న జెసి తమీమ్ అన్సారీయా










