Apr 05,2023 21:13

- సిఎం సహాయనిధి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

మదనపల్లె అర్బన్‌ : సిఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. బుధవారం పట్టణానికి చెందిన మక్కినేని వేణుగోపాల్‌ అనే లబ్ధిదారుడికి సిఎం సహాయ నిధి ద్వారా రూ.1.40 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు 3000 జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని, వివిధ నగరాల్లో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి సిఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నారని కొనియాడారు. అనంతరం మునిసిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులు శారదారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా గొప్ప మనసున్న నాయకుడని, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే ఆయన నైజమన్నారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివద్ధి చేశారని కొనియాడారు. అనంతరం లబ్ధిదారుడు వేణుగోపాల్‌ మాట్లాడుతూ సిఎం సహాయనిధి ద్వారా తనకు నగదును అందజేసిన ఎమ్మెల్యే నవాజ్‌బాషా, శారదరెడ్డిలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.