Dec 17,2022 19:21

విద్యార్థికి మెమోంటో ఇస్తున్న సిడిపిఒ సుజాత

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఒ సుజాత అన్నారు. ఫోర్డ్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నెలసరిపై అవహగానా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. శనివారం స్థానిక మదనపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క బాలిక నెలసరిపై సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నెలసరి సమయంలో తగినటువంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. మనం తీసుకొనే ఆహారం బట్టి మన రుతుస్రావం ఆధారపడి ఉండదని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి గ్రామ/కాలనీలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉండి, బాల్య వివాహాలు నిర్వహించు సమయంలో పోలీస్‌ లేదా మహిళ శిశు సంక్షేమశాఖ సిబ్బందికి తెలియచేసి బాల్యవివాహాలు నివారించాలని పేర్కొన్నారు. వన్‌ టౌన్‌ ఎఎస్‌ఐ సావిత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క బాలిక వారి వ్యక్తిగత విషయాలలో గోప్యత పాటించాలని తెలిపారు. డిజిటల్‌, సోసియల్‌ మీడియాతో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.