రాయచోటి : అంగన్వాడీి కేంద్రాలలో చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టి కాహారం అందించడమే తమ లక్ష్యమని జిల్లా మహిళా శిశు సంక్షేమ , సాధికారత అధికారిని మిద్దింటి ధనలక్ష్మి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో ఐసి డిఎస్ ప్రాజెక్టుల పనితీరు, అంగన్వాడీలో చిన్నపిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, అందుతున్న పౌష్టికాహారం, వసతుల గురించి ఎలా అందించాలో, అంగన్వాడీ పోస్టుల భర్తికీ చేపడుతున్న చర్యలను ప్రజాశక్తి ఇచ్చిన ముఖా ముఖిలో ఆమె వివరించారు .
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు వివరాల తెలపండి?
జిల్లాలో 9 ఐసిడిఎస్ ప్రాజెక్టులున్నాయి . ఇందులో మెయిన్ కేంద్రాలు 1858, మినీ 417, మొత్తం 2275 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. జిల్లాలో మొత్తం లో 79 గ్రేడ్-1 అండ్ 2 సూపర్‌వైజర్లున్నారు
పౌష్టికాహారం వివరాలు తెలపండి?
గర్భిణులు, బాలింతలు కలిపి మొత్తం జిల్లాలో 23,455 మంది ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి వైఎస్‌ఆర్(రాగిపిండి 1 కేజి, జొన్నపిండి 1 కేజి, అటుకులు 1 కేజి, ఎండు కర్జూరం 250 గ్రాములు, వేరుశెనగ చిక్కి 250 గ్రాములు , బెల్లం 250 గ్రాములు చొప్పున) ఇంటికి అందజే స్తున్నాం. రోజూ మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట భోజనంతోపాటు గుడ్డు, పాలు అందజేస్తున్నాం. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు పిల్లలు జిల్లా వ్యాప్తంగా 41,075 మంది ఉన్నారు. వారికి రోజూ అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట భోజనంతో పాటు 1 గుడ్డు, పాలు 100 మిల్లీ లీటర్లు అందజేస్తున్నాం.6 నెలల నుంచి 3 సంవత్సరముల పిల్లలు జిల్లా మొ త్తంలో 56,667 మంది పిల్లలు ఉన్నారు. వీరికి నెలకు మొదటి విడతలో 13 గుడ్లు, 1.5 లీటర్ల పాలు, రెండవ విడతలో 12 గుడ్లు, 1.0 లీటరు పాలతో పాటు 2.5 కేజీల బాలామతం అందజేస్తున్నాం.
జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు తెలపండి ?
జిల్లా వ్యాప్తంగా మెయిన్, మినీ అంగ న్వాడీ కార్యకర్తలు కలిపి 20 పోస్టులు , సహా యకురాలు 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బాల్య వాహల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
బాల్యవివాహాల నివారణకు జిల్లా, మండల స్థారు ుల్లో కమిటీలు ఏర్పాటు చేశాం. అంగన్వాడీ కార్యకర్త నుంచి జిల్లా స్థాయి అధికారులవరకు అందరూ కలిసి గ్రామాలలో, పార Äశాలల్లో బాలికల హాస్టల్‌లో పిల్లలకు, తల్లితండ్రులకు అవ గాహన పెంపొందిచడానికి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
అదనపు అంగన్వాడీ కేంద్రాలకు ప్రతిపాదనలను ఏమైనా పంపారా ?
అదనపు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చెయ్యడానికి జిల్లాలో సిడిపిఒలకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడ అదనపు అదనపు అంగన్వాడీ కేంద్రం అవసరమో అక్కడ ఏర్పాటు చేసేందుకు సర్వే చేస్తున్నారు. అదనపు అంగన్వాడీ కేంద్రం అవసరం ఉన్నదో వాటిని సర్వే చేస్తున్నారు.ఐసిడిఎస్ పీడీ ఎం . ధనలక్ష్మి










