రాయచోటి : సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయాలని ఎపి జెఎసి నాయకులు పేర్కొన్నారు. శనివారం ఎపి జెఎసి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు నరసింహ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘంజిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి మల్లికార్జున అధ్యక్షత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు సంక్షేమ పథకాల అమలులో అహర్నిశలు శ్రమిస్తున్న తమకు చట్టబద్ధంగా రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. సచివాలయ సిబ్బంది బదిలీల విషయంలో పునః పరిశీలన చేసి, అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తూ వెంటనే పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రొబిహిషన్ డిక్లరేషన్‌కు, డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఉద్యోగాలు, ఉపాధ్యాయులు సచివాలయం సిబ్బంది, అవుట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌టిసి యూనియన్ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు మాధవి, వేణు, లక్ష్మి నారాయణ, హరి ప్రసాద్,శి వశంకర్ రాజు, సోమేశ్వర,వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










