పార్టీలోకి చేరిన వారితో చిలకం మధుసూదన్ రెడ్డి
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని 32వ వార్డు దుర్గానగర్‌కు చెందిన 10 కుటుంబాలకు చెందిన షేక్షాహీద్, దేవిపురం రామాంజి, సాదేచంద్ర, కంపల శేషు, కువల ప్రవీణ్, మల్లెల వెంకటేశ్, వేల్పమడుగు సూర్యనారాయణరెడ్డి తదితరులు జనసేనలోకి చేరారు. ఈసందర్భంగా చిలకం మధుసూదన్‌రెడ్డి వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిలకం మాట్లాడుతూ జనసేనపార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడానికి అందరు కలిసికట్టుగా కషిచేయాలన్నారు.










