ప్రజాశక్తి-హిందూపురం హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా పారిశుధ్యం మెరుగు పరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రత్యేక జెసిబిలను ఏర్పాటు చేసి వర్షాకాలంలో పూడిపోయిన ప్రధాన కాలువల్లో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలకు పెద్ద కాలువల్లో వర్షం నీరు పారడంతోపాటు చెత్తచెదారం కొట్టుకురావడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలబడి పోతున్నాయన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతూ దోమలు విపరీతంగా వృద్ధి చెంది విషజ్వారాల భారిన పడుతున్నారు. అలాగే ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను పురపాలక సంఘం వారు తీసుకొచ్చే చెత్త వాహనాల్లో అందించాలన్నారు. పారిశుధ్య మెరుగు పర్చడానికి పురపాలక సంఘం వారు తీసుకునే చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరిస్తే మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు.
కాలువల్లో పూడికతీస్తున్న మున్సిపల్ సిబ్బంది










