ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యా లయంలో రాకేమ్ ఫార్మా లిమిటెడ్ వారి సి ఎస్ ఆర్ నిధులతో జగ్గయ్య పేట మున్సిపల్ వర్కర్స్‌కు ఆదివారం యప్రాన్లు, కళ్ళజోళ్ళు, గమ్ బూట్లు, హాండ్ గ్లవ్స్ లను శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అమోఘమన్నారు. ప్రజారోగ్యం కోసం శ్రమించే కష్టజీవులు పారిశుద్ధ్య కార్మికులన్నారు. వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించాలన్న తలంపుతో కనీస వేతనం 18 వేల రూపాయలకు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్‌ఆర్సిపి నాయకులు, మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, రాకేమ్ ఫార్మా లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎం ఎస్ ఎన్ రెడ్డి, హెచ్‌ఆర్ పర్సన్స్ రాజా చంద్, సోమయ్య అధికారులు పాల్గొన్నారు.










