Nov 13,2020 07:33

పూట గడవని పేదోడు
పాపం పేదోడు
కడుపు నిండా అన్నం తిని
ఎన్ని రోజులు అయ్యిందో
కూడూ లేదు గూడూ లేదు
నీడా లేదు
ఫుట్‌పాత్‌ మీద నిద్ర
కంటి నిండా కరువైన నిద్ర
చిరిగిన బట్టలు
చెదిరిన జుట్టు
చేతిలో బొచ్చె
నోట్లో ఎంగిలి బీడీ ముక్క
అడుక్కునే వాడి
జీవితంలో ఎన్నో
కాశీ మజిలీలు
వీరి బతుకుల్లో మాత్రం
మార్పు రాలేదు
ఎవరి స్వార్థం వారిది
ఈ పేదోడి గోడు
పట్టించుకోరేమి
పాపం పేదోడు!
బతుకు బండిపై
ఆశలు పెంచుకోలేనోడు
పాపం పేదోడు.... రైల్వే స్టేషన్లు,
బస్‌ స్టాండ్లు, ఆశ్రయించేవాడు
ఇతరుల సాయం కోసం నిత్యం
ఎదురుచూసే వాడు
పాపం పేదోడు!
 

- ఎల్‌. ప్రఫుల్లచంద్ర
సెల్‌ : 63005 46700