Jul 24,2021 10:22

నెల్లూరు : సోమశిల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 53.38 టిఎంసిలుగా ఉంది. ప్రాజెక్ట్‌ ఇన్‌ ప్లో 11,389 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 750 క్యూసెక్కులుగా ఉంది.