Apr 04,2023 21:05

కేక్‌ కట్‌ చేస్తున్న జెసి తమీమ్‌ అన్సారీయా


ప్రజాశక్తి - రాయచోటి: నూతనోత్తేజంతో ఇంకా బాగా పని చేయాలని వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బందిని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు. జిల్లా ఏర్పాటై ఏడాది పూర్తి కావడంతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బందితో కలిసి ఆమె కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడిన తరువాత ప్రథమ కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా అభివద్ధికి వివిధ శాఖల అధికారులు బాగా కషి చేశారని, ఇలాగే రెట్టింపు ఉత్సాహంతో మనమందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్ర అభివద్ధికి తోడ్పడదామని ఆమె పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన జిల్లా బాలారిష్టాలు అన్ని దాటుకొని అన్నమయ్య జిల్లాలో సిబ్బంది అందరూ బాగా పని చేశారని, జిల్లాలో మంచి అధికారుల బందం కలదని కితాబు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందేలా చూడడంతో పాటు వారి సంక్షేమ అభివద్ధికి తోడ్పాటు ఇద్దామన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అందరం కష్టపడి పని చేద్దామన్నారు. వేడుకలలో కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, విఎస్‌ డబ్ల్యూ ఎస్‌ఎఒ మనోహర్‌ రాజు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి భరత్‌ కుమార్‌ రెడ్డి, డిపిఆర్‌ఓ సిహెచ్‌ పురుషోత్తం, సమాచార శాఖ పిఆర్‌ఒ, కలెక్టరేట్‌ సూపర్డెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.