Jan 30,2023 17:19

ప్రజాశక్తి-కర్నూల్-స్పోర్ట్స్: జాతీయస్థాయి వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు తరఫున శరణ్య, ప్రేమ కుమారిలు ఎంపికైనట్లు వాలీ బాల్ కార్యదర్శి  శరీఫ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో అత్యంతమ ప్రతిభ కనిపరిచిన కర్నూలు వాలీబాల్ మహిళలు జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్కు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఫిబ్రవరి రెండో తేదీ నుండి 9వ తేదీ దాకా అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరగబోయే జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. సీనియర్ వాలీబాల్ ఆటగాడు జాఫర్ మున్న, వాలీబాల్ సంఘం హర్షం ప్రకటించారు.